Lyrics

ఆదిభిక్షువు వాడినేది కోరేది బూడిదిచ్చేవాడినేది అడిగేది ఆదిభిక్షువు వాడినేది కోరేది బూడిదిచ్చేవాడినేది అడిగేది ఏది కోరేది వాడినేది అడిగేది ఏది కోరేది వాడినేది అడిగేది తీపిరాగాల ఆ కోకిలమ్మకు నల్లరంగునలమినవాడినేది కోరేది తీపిరాగాల ఆ కోకిలమ్మకు నల్లరంగునలమినవాడినేది కోరేది కరకు గర్జనల మేఘముల మేనికి మెరుపు హంగు కూర్చినవాడినేది అడిగేది ఏది కోరేది వాడినేది అడిగేది ఏది కోరేది వాడినేది అడిగేది తేనెలొలికే పూలబాలలకు మూణ్ణాళ్ళ ఆయువిచ్చినవాడినేది కోరేది తేనెలొలికే పూలబాలలకు మూణ్ణాళ్ళ ఆయువిచ్చినవాడినేది కోరేది బండరాళ్ళను చిరాయువుగ జీవించమని ఆనతిచ్చినవాడినేది అడిగేది ఏది కోరేది వాడినేది అడిగేది ఏది కోరేది వాడినేది అడిగేది గిరిబాలతో తనకు కళ్యాణమొనరింప దరిచేరు మన్మథుని మసిచేసినాడు... వాడినేది కోరేది వరగర్వమున మూడులోకాల పీడింప తలపోయు దనుజులను కరుణించినాడు... వాడినేది అడిగేది ముఖప్రీతి కోరేటి ఉగ్గుశంకరుడు... వాడినేది కోరేది ముక్కంటి ముక్కోపి... ముక్కంటి ముక్కోపి తిక్కశంకరుడు ఆది భిక్షువు వాడినేది కోరేది బూడిదిచ్చేవాడినేది అడిగేది ఏది కోరేది వాడినేది అడిగేది
Writer(s): K.v.mahadevan K.v.mahadevan, Sirivennela Seetharamashastry Lyrics powered by www.musixmatch.com
Get up to 2 months free of Apple Music
instagramSharePathic_arrow_out