Lyrics

ఎలా ఎలా దాచావు అలవి కాని అనురాగం ఇన్నాళ్లూ ఇన్నేళ్లూ ఎలా ఎలా దాచావు అలవి కాని అనురాగం ఇన్నాళ్లూ ఇన్నేళ్లూ ఇన్నాళ్లూ ఇన్నేళ్లూ పిలిచి పిలిచినా పలుకరించినా పులకించదు కదా నీ ఎదా ఉసురుసురనినా గుసగుసమనినా ఊగదే మది నీ మది నిదుర రాని నిశిరాతురులెన్నో నిట్టూరుపులెన్నో నోరులేని ఆవేదనలెన్నో ఆరాటములెన్నో ఎలా ఎలా దాచావు అలవి కాని అనురాగం ఇన్నాళ్లూ ఇన్నేళ్లూ ఇన్నాళ్లూ ఇన్నేళ్లూ తలుపులు తెరుచుకొని వాకిటనే నిలబడతారా ఎవరైనా తెరిచి ఉందని వాకిటి తలుపు చొరబడతారా ఎవరైనా దొరవో మరి దొంగవో దొరవో మరి దొంగవో దొరికావు ఈనాటికి దొంగను కానూ దొరనూ కానూ దొంగను కానూ దొరనూ కానూ నంగనాచినసలే కానూ ఎలా ఎలా దాచావు అలవి కాని అనురాగం ఇన్నాళ్లూ ఇన్నేళ్లూ
Writer(s): K V Mahadevan, Devulapalli Krishna Sastry Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out