Lyrics

గోవుల్లు తెల్లన గోపయ్య నల్లనా గోధూళి ఎర్రనా ఎందువలనా గోవుల్లు తెల్లన గోపయ్య నల్లనా గోధూళి ఎర్రనా ఎందువలనా గోధూళి ఎర్రనా ఎందువలనా తెల్లావు కదుపుల్లో కర్రావులుండవా ఎందుకుండవ్ కర్రావు కడుపునా ఎర్రావు పుట్టదా ఏమో తెల్లావు కదుపుల్లో కర్రావులుండవా కర్రావు కడుపునా ఎర్రావు పుట్టదా గోపయ్య ఆడున్న గోపెమ్మ ఈడున్న గోధూళి కుంకుమై గోపెమ్మకంటదా ఆ పొద్దు పొడిచేనా ఈ పొద్దు గడిచేనా ఎందువలనా అంటే అందువలనా ఎందువలనా అంటే దైవఘటనా గోవుల్లు తెల్లన గోపయ్య నల్లనా గోధూళి ఎర్రనా ఎందువలనా హొయ్ ఒయ్ గోధూళి ఎర్రనా ఎందువలనా పిల్లనగ్రోవికీ నిలువెల్ల గాయాలూ పాపం అల్లన మోవికీ తాకితే గేయాలూ పిల్లనగ్రోవికీ నిలువెల్ల గాయాలూ అల్లన మోవికీ తాకితే గేయాలూ ఆ మురళి మూగైనా ఆ పెదవి మోడైనా ఆ గుండె గొంతులో ఈ పాట నిండదా ఈ కడిమీ పూసేనా ఆ కలిమీ చూసేనా ఎందువలనా అంటే అందువలనా ఎందువలనా అంటే దైవఘటనా గోవుల్లు తెల్లన గోపయ్య నల్లనా గోధూళి ఎల్లనా ఎందువలనా గోధూళి ఎర్రనా ఎందువలనా
Writer(s): Veturi Sundara Ramamurthy, K V Mahadevan Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out