Lyrics

అందమైన జీవితము అద్దాల సౌధము చిన్నరాయి విసిరినా చెదరిపోవును ఒక్క తప్పు చేసినా ముక్కలే మిగులును అందమైన జీవితము అద్దాల సౌధము చిన్నరాయి విసిరినా చెదరిపోవును ఒక్క తప్పు చేసినా ముక్కలే మిగులును అందమైన జీవితము అద్దాల సౌధము నిప్పువంటి వాడవు తప్పు చేసినావు ఎంత తప్పు చేసినావు క్షణికమైన ఆవేశం మనసునే చంపింది నిన్ను పశువుగా మార్చింది నీ పడుచుదనం దుడుకుతనం పంతాలకి పోయింది పచ్చనైన నీ బ్రతుకుని పతనానికి లాగింది నిన్ను బలిపశువును చేసింది అందమైన జీవితము అద్దాల సౌధము ఎవరిది ఈ నేరమని ఎంచి చూడదు లోకం ఎంచి చూడదు ఏదో పొరపాటని మన్నించదు నిన్ను మన్నించదు అరిటాకు వంటిది ఆడదాని శీలము అరిటాకు వంటిది ఆడదాని శీలము ముల్లు వచ్చి వాలినా తాను కాలు జారినా ముప్పు తనకే తప్పదు ముందు బ్రతుకె వుండదు అందమైన జీవితము అద్దాల సౌధము చిన్నరాయి విసిరినా చెదరిపోవును ఒక్క తప్పు చేసినా ముక్కలే మిగులును అందమైన జీవితము అద్దాల సౌధము
Writer(s): Dasarathi, Athreya, K V Mahadevan, Kosaraju Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out