Lyrics

మెరిసే తారలదేరూపం విరిసే పువ్వులదేరూపం అది నా కంటికి శూన్యం మనసున కొలువై మమతల నెలవై వెలసిన దేవిది ఏ రూపం నా కన్నులు చూడని రూపం గుడిలో దేవత ప్రతిరూపం నీ రూపం అపురూపం మనసున కొలువై మమతల నెలవై వెలసిన దేవిది ఏ రూపం నా కన్నులు చూడని రూపం గుడిలో దేవత ప్రతిరూపం నీ రూపం అపురూపం ఎవరి రాకతో గళమున పాటల ఏరువాక సాగేనో ఆ వసంత మాసపు కులగోత్రాలను ఎలకోయిల అడిగేనా ఎవరి పిలుపుతో పులకరించి పురివిప్పి తనువు ఊగేనో ఆ తొలకరి మేఘపు గుణగణాలకై నెమలి వెదుకులాడేనా నా కన్నులు చూడని రూపం గుడిలో దేవత ప్రతిరూపం నీ రూపం అపురూపం ప్రాణం పుట్టుక ప్రాణికి తెలియాలా గానం పుట్టుక గాత్రం చూడాలా ప్రాణం పుట్టుక ప్రాణికి తెలియాలా గానం పుట్టుక గాత్రం చూడాలా వెదురును మురళిగ మలచి ఈ వెదురును మురళిగ మలచి నాలో జీవననాదం పలికిన నీవే నా ప్రాణ స్పందన నీకే నా హృదయ నివేదన మనసున కొలువై మమతల నెలవై వెలసిన దేవిది ఏ రూపం నా కన్నులు చూడని రూపం గుడిలో దేవత ప్రతిరూపం నీ రూపం అపురూపం
Writer(s): K. V. Mahadevan, Sitarama Sirivennela Sastry Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out