Lyrics

ప|| మూసిన ముత్యాన కేలే మొరగులు | ఆశల చిత్తాన కేలే అలవోకలు || చ|| కందులేని మోమున కేలే కస్తూరి | చిందు నీకొప్పున కేలే చేమంతులు | మందయానమున కేలే మట్టెల మోత | గంధమేలే పై కమ్మని నీమేనికి || చ|| భారపు గుబ్బల కేలే పయ్యద నీ | బీరపు జూపుల కేలే పెడమోము | జీరల భుజాల కేలే చెమటలు నీ | గోరంట గోళ్ళ కేలే కొనవాండ్లు || చ|| ముద్దుల మాటల కేలే ముదములు నీ | యద్దపు జెక్కుల కేలే అరవిరి | వొద్దిక కూటమి కేలే వూర్పులు నీకు | నద్దమేలే తిరువేంకటాద్రీశు గూడి ||
Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out