Lyrics

ఈ పుట్టినరోజు. నీ నోములు పండిన రోజు దివిలో భువిలో కనివిని ఎరుగని. అందాలన్ని అందే రోజు ఈ పుట్టినరోజు. నీ నోములు పండిన రోజు దివిలో భువిలో కనివిని ఎరుగని. అందాలన్ని అందే రోజు ఏ అందాలు. తళతళ మెరిసే తారకలారా ఇలకే దిగిరండీ తళతళ మెరిసే తారకలారా ఇలకే దిగిరండీ మీలో విరిసే లేత వెలుగులు. మా చెలి కన్నుల నింపండి ఆ వెలుగులలో నా చెలి ప్రియుడు ఆనందించాలి ఈ పుట్టినరోజు.నీ నోములు పండినరోజూ... అలల పూల ఉయ్యాలల ఆడుకునే హంసలారా .ఆ... ఆ అలల పూల ఉయ్యాలల ఆడుకునే హంసలారా మీ నడకల వయ్యారం మా చెలికే ఇవ్వరారా . ఆ... ఆ ఆ వయ్యారం చూసి చూసి. ఆమె ప్రియుడు మురియాలీ ఈ పుట్టినరోజు.నీ నోములు పండినరోజూ. పురివిప్పి నటియించు నీలాల నెమలి పురివిప్పి నటియించు నీలాల నెమలి మీలోని హొయలంత చెలికియ్యరాదా.ఆ.ఆ అందాల చెలి నాట్యమాడేటి వేళ చెలికాని మనసెల్ల విలసిల్ల గలదు... ఆ.ఆ.ఆ.ఆ ఈ పుట్టినరోజు. నీ నోములు పండిన రోజు దివిలో భువిలో కనివిని ఎరుగని. అందాలన్ని అందే రోజు ఈ పుట్టినరోజు.నీ నోములు పండిన రోజూ...
Writer(s): Dasarathi, S Rajeshwara Rao Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out