Lyrics

చిత్రం: చిక్కడు దొరకడు (1967) సంగీతం: టి.వి. రాజు గీతరచయిత: సినారె నేపధ్య గానం: ఘంటసాల, సుశీల దోర నిమ్మపండులాగ ఊరించే దొరసాని దోచుకోనా నీ పరువం ...దాచలేనే ఈ విరహం పూలలోన సోయగాలు పొంగిపోయే నీలోన నింగిలోని చందమామ తొంగి చూసె నీలోన మెరుపులోని చురుకుదనాలు మెరిసిపోయె నీలోన మెరుపులోని చురుకుదనాలు మెరిసిపోయె నీలోన మరులొలికే నీ మగసిరి చూసి కరిగిపోదును లోలోనా దోర నిమ్మపండులాగ ఊరించే దొరసాని దోచుకోనా నీ పరువం... దాచలేనే ఈ విరహం మేనిలోన వీణలేవో మెలమెల్లగ పలికినవి మనసులోన తేనెలేవో సనసనాగ ఒళికినవి నన్ను నీవు తాగగానే నడిరాతిరి నవ్వింది నన్ను నీవు తాగగానే నడిరాతిరి నవ్వింది వగలులూరే నీ నగవులు దాగే వలపు బాస తెలిసింది దోర నిమ్మపండులాగ ఊరించే దొరగారు దోచుకో ఇక నా పరువం... దాచుటెందుకు నీ విరహం
Writer(s): T V Raju, Dr. C Narayana Reddy Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out