Lyrics

చదువు రాని వాడవని దిగులు చెందకు చదువు రాని వాడవని దిగులు చెందకు మనిషి మదిలోన మమత లేని చదువులెందుకు చదువు రాని వాడవని దిగులు చెందకు మనిషి మదిలోన మమత లేని చదువులెందుకు చదువు రాని వాడవని దిగులు చెందకు మంచు వంటి మల్లె వంటి మంచు వంటి మల్లె వంటి మంచి మనసుతో మంచు వంటి మల్లె వంటి మంచి మనసుతో జీవించలేని పనికిరాని బ్రతుకులెందుకు చదువు రాని వాడవని దిగులు చెందకు మనిషి మదిలోన మమత లేని చదువులెందుకు చదువు రాని వాడవని దిగులు చెందకు ఏమి చదివి పక్షులు పైకెగుర గలిగేను ఏచదువు వల్ల చేపపిల్ల లీదగలిగెను ఏమి చదివి పక్షులు పైకెగుర గలిగేను ఏచదువు వల్ల చేపపిల్ల లీదగలిగెను అడవిలోనినెమలికెవడు ఆట నేర్పేను అడవిలోని నెమలికెవడు ఆట నేర్పేను కొమ్మ పైని కోయిలమ్మ కెవడు పాట నేర్పేను చదువు రాని వాడవని దిగులు చెందకు మనిషి మదిలోన మమత లేని చదువులెందుకు చదువు రాని వాడవని దిగులు చెందకు తెలివి లేని లేగ దూడ పిలుచుని అంబా అని యేమెరుగని చంటి పాప యేడ్చును అమ్మా అని తెలివి లేని లేగ దూడ పిలుచుని అంబా అని యేమెరుగని చంటి పాప యేడ్చును అమ్మా అని చదువులతో పని యేమి హృదయం ఉన్న చాలు చదువులతో పని యేమి హృదయం ఉన్న చాలు కాయితంబు పూల కన్న గరిక పూవు మేలు చదువు రాని వాడవని దిగులు చెందకు మనిషి మదిలోన మమత లేని చదువులెందుకు చదువు రాని వాడవని దిగులు చెందకు
Writer(s): Athreya, K V Mahadevan Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out