Lyrics

చిత్రం: సిరి సంపదలు (1962) సంగీతం: మాస్టర్ వేణు గీతరచయిత: ఆచార్య ఆత్రేయ నేపధ్య గానం: సుశీల గుడిలో దేవుని గంటలా... నా హృదిలో ఆరని మంటలా కలలు కన్న కన్నె వలపులు గాలిగోపుర దీపాలా... గుడిలో దేవుని గంటలా ...నా హృదిలో ఆరని మంటలా ఆలయమందున దేవుడు వున్నా మనుజులందరికీ మనసులు వున్నా ఆలయమందున దేవుడు వున్నా మనుజులందరికీ మనసులు వున్నా ఆలకించరా ... ఆలకించరా... ఆవేదనలూ ఆదరించరా... అనురాగాలు గుడిలో దేవుని గంటలా ...నా హృదిలో ఆరని మంటలా... ప్రేమించిన మా పసి హృదయాలను... శాసించెనుగా ముది ద్వేషాలు... ప్రేమించిన మా పసి హృదయాలను శాసించెనుగా ముది ద్వేషాలు... దేవుడు రాసిన వ్రాతలా ...ఇది పెద్దలు చేసిన చేతలా. గుడిలో దేవుని గంటలా ...నా హృదిలో ఆరని మంటలా తొలి ప్రేమను చవి చూపిన తల్లే ... విధి లేదనుకుని విడదీసినదా తొలి ప్రేమను చవి చూపిన తల్లే ... విధి లేదనుకుని విడదీసినదా ఈ విష బిందువు చిందినదెవరో... జీవితమెడారి చేసినదెవరో.
Writer(s): Athreya, Master Venu Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out