Lyrics

ఆ ఆ ఆ ఆ ఆ ఆ పాడెద నీ నామమే గోపాలా పాడెద నీ నామమే గోపాలా హృదయములోనే పదిలముగానే నిలిపెద నీ రూపమేరా పాడెద నీ నామమే గోపాలా మమతలతోనే మాలికలల్లి నిలిచితి నీకోసమేరా మమతలతోనే మాలికలల్లి నిలిచితి నీకోసమేరా ఆశలతోనే హారతి చేసి పదములు పూజింతు రారా పాడెద నీ నామమే గోపాలా నీ మురళీ గానమే పిలిచెరా కన్నుల నీమోము కదలెనులేరా నీ మురళీగానమే పిలిచెరా పొన్నలు పూచే బృందావనిలో వెన్నెల కురిసే యమునాతటిపై. ఆ ఆ ఆ ఆ పొన్నలు పూచే బృందావనిలో వెన్నెల కురిసే యమునాతటిపై. నీ సన్నిధిలో జీవితమంతా కానుక చేసేను రారా పాడెద నీ నామమే గోపాలా హృదయములోనే పదిలముగానే నిలిపెద నీ రూపమేరా పాడెద నీ నామమే గోపాలా
Writer(s): Dasarathi, S Rajeshwara Rao Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out