Lyrics

సడిసేయకో గాలి సడి సేయబోకే సడిసేయకో గాలి సడి సేయబోకే బడలి ఒడిలో రాజు పవ్వళించేనే సడిసేయకే రత్న పీఠిక లేని రారాజు నాసామి మణి కిరీటము లేని మహరాజుగాకేమి చిలిపి పరుగులమాని కొలిచిపోరాదే సడిసేయకే ఏటి గలగలలకే.ఎగసి లేచేనే ఆకు కదలికలకే అదిరి చూసేనే నిదుర చెదిరిందంటే నేనూరుకోనే సడిసేయకే పండు వెన్నెలనడిగి పాన్పు తేరాదే ఈడ మబ్బుల దాగు నిదుర తేరాదే విరుల వీవన బూని విసిరి పోరాదే సడిసేయకో గాలి సడి సేయబోకే బడలి ఒడిలో రాజు పవ్వళించేనే సడిసేయకో గాలి
Writer(s): Master Venu, Devulapalli Krishna Sastry Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out