Lyrics

నిన్న మొన్న రేకు విప్పిన లేత మొగ్గా నీకు ఇంతలోనె నన్ను చూస్తే అంత సిగ్గా నిన్న మొన్న రెక్కలొచిన గండు తుమ్మెద నీకు అంతలోనె నన్ను చూస్తే ఇంత తొందరా పరికిణీలు కట్టినపుడు లేని సొగసులు నీ పైట కొంగు చాటున దోబూచులాడెను పసితనాన ఆడుకొన్న తొక్కుడు బిళ్ళలు నీ పరువానికి నేర్పినవి దుడుకు కోర్కెలు నిన్న మొన్న రేకు విప్పిన లేత మొగ్గా నీకు ఇంతలోనె నన్ను చూస్తే అంత సిగ్గా నిన్న మొన్న రెక్కలొచిన గండు తుమ్మెద నీకు అంతలోనె నన్ను చూస్తే ఇంత తొందరా పాల బుగ్గలు పూచె లేత కెంపులు వాలు చూపులందుతోటె వయసు జోరులు చిరుత నవ్వులు ఒలికె చిలిపితనాలు చిన్ననాటి చెలిమి తీసె వలపు దారులు నిన్న మొన్న రేకు విప్పిన లేత మొగ్గా నీకు ఇంతలోనె నన్ను చూస్తే అంత సిగ్గా నిన్న మొన్న రెక్కలొచిన గండు తుమ్మెద నీకు అంతలోనె నన్ను చూస్తే ఇంత తొందరా ఇన్నాళ్ళు కళ్ళు కళ్ళు కలిపి చూస్తివి ఇపుడేల రెప్పలలా రెపరెపన్నవి ఇన్నాళ్ళు కళ్ళు కళ్ళు కలిపి చూస్తివి ఇపుడేల రెప్పలలా రెపరెపన్నవి ఇన్నాళ్ళు నీ కళ్ళు ఊరుకున్నవి ఇపుడేవేవో ఇపుడేవేవో మూగబాస లాడుతున్నవి ఇన్నాళ్ళు నీ కళ్ళు ఊరుకున్నవి ఇపుడేవేవో ఇపుడేవేవో మూగబాస లాడుతున్నవి నిన్న మొన్న రేకు విప్పిన లేత మొగ్గా నీకు ఇంతలోనె నన్ను చూస్తే అంత సిగ్గా నిన్న మొన్న రెక్కలొచిన గండు తుమ్మెద నీకు అంతలోనె నన్ను చూస్తే ఇంత తొందరా సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
Writer(s): K V Mahadevan, Arudra Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out