Lyrics

రవి వర్మకే అందని ఒకే ఒక అందానివో రవి వర్మకే అందని ఒక అందానివో రవి చూడని పాడని నవ్య రాగానివో రవి వర్మకే అందని ఒకే ఒక అందానివో ఏ రాగమో తీగదాటి ఒంటిగా నిలిచే ఎ యొగమో నన్ను దాటి జంటగా పిలిచే ఏ మూగభావాలో అనురాగ యోగాలై నీ పాటనే పాడనీ రవి వర్మకే అందని ఒకే ఒక అందానివో ఏ గగనమో కురుల జారి నీలిమై పోయే ఏ ఉదయమో నుదుట చేరి కుంకుమై పోయే ఆ కావ్య కల్పనలే నీ దివ్య శిల్పాలై కదలాడనీ పాడనీ రవి వర్మకే అందని ఒకే ఒక అందానివో రవి చూడని పాడని నవ్య రాగానివో రవి వర్మకే అందని ఒకే ఒక అందానివో
Writer(s): Veturi Sundara Ramamurthy, G K Venkatesh Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out