Lyrics

అలిగితివా సఖీ ప్రియ కలత మానవా అలిగితివా సఖీ ప్రియ కలత మానవా ప్రియమారగ నీ దాసుని ఏలజాలవా అలిగితివా సఖీ ప్రియ కలత మానవా లేని తగవు నటింతువా మనసు తెలియ నెంచితివా లేని తగవు నటింతువా మనసు తెలియ నెంచితివా ఈ పరీక్ష మాని ఇంక దయనుజూడవా ఆఆ అలిగితివా సఖీ ప్రియ కలత మానవా నీవె నాకు ప్రాణమని నీయానతి మీరనని నీవె నాకు ప్రాణమని నీయానతి మీరనని సత్యాపతి నా బిరుదని నింద యెరుగవా ఆ ఆ అలిగితివా సఖీ ప్రియ కలత మానవా ప్రియురాలివి సరసనుండి విరహమిటుల విధింతువా ఆ ఆ ఆఆ ఆ ఆ ఆ ప్రియురాలివి సరసనుండి విరహమిటుల విధింతువా భరియింపగ నా తరమా కనికరింపవాఆ ఆ ఆ నను భవదీయ దాసుని మనంబున నెయ్యపుఁగింకఁ బూని తాచిన యది నాకు మన్ననయ చెల్వగు నీ పదపల్లవంబు మత్తను పులకాగ్ర కంటక వితానము తాకిన నొచ్చునంచు నేననియెద అల్క మానవుగదా యికనైన అరాళకుంతలా అరాళకుంతలా ఆ ఆ ఆఆ ఆ ఆ ఆ
Writer(s): Pingali, Pendyalaya Nageswara Rao Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out