Lyrics

చాలదా ఈ పూజ దేవి... చాలదా ఈ కొలువు దేవి... నీ భక్తునింత నిరాదరణ చేయనేలా... ఆ. చాలదా ఈ పూజ దేవీ ... నీ వాలు చూపులే... నా ప్రాణము... నీ మందహాసమే... నా జీవము... తపము జపము చేసి అలసి సొలసి పోతినే... ఇక కనికరించి ఈ బాధను బాపవేలా... ఆ... చాలదా ఈ పూజ దేవి... చాలదా ఈ కొలువు దేవి... నీ అందెల గలగలలే... ప్రణవ నాదము నీ కంకణ రవళియే... ప్రణయ గీతము నీ కటాక్ష వీక్షణమే నాకు మోక్షము... కరుణజూపి ఈ దీనుని కావవేలా. ఆ. చాలదా ఈ పూజ దేవీ... చాలదా ఈ కొలువు దేవీ నీవులేని నిముషాలే యుగములాయెనే చెంతనుండి మాటలేని యోగమాయెనే వరము కోరి ఈ చెరలో చిక్కుబడితినే... జాలి దలిచి ముక్తి నొసగ జాలమేలా... ఆ.ఆ. చాలదా ఈ పూజ దేవీ... చాలదా ఈ కొలువు దేవీ నీ భక్తునింత నిరాదరణ చేయనేలా. ఆ... చాలదా ఈ పూజ దేవీ...
Writer(s): Pendyala, Pingali Vani Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out