Lyrics

ఓహో ఓ ఓ ఓహోహో ఓ ఓ ఓహోహో ఓ ఓ ఓ ఓ ఈ నల్లని రాళ్లలో ఏ కన్నులు దాగెనో ఈ బండల మాటున ఏ గుండెలు మ్రోగెనో ఈ నల్లని రాళ్లలో పాపాలకు తాపాలకు బహు దూరములోనున్నవి పాపాలకు తాపాలకు బహు దూరములోనున్నవి మునులవోలె కారడవుల మూలలందు పడియున్నవి ఈ నల్లని రాళ్లలో కదలలేవు మెదలలేవు పెదవి విప్పి పలుకలేవు కదలలేవు మెదలలేవు పెదవి విప్పి పలుకలేవు ఉలి అలికిడి విన్నంతనే ఉలి అలికిడి విన్నంతనే జల జలమని పొంగి పొరలు ఈ నల్లని రాళ్లలో పైన కఠినమనిపించును లోన వెన్న కనిపించును పైన కఠినమనిపించును లోన వెన్న కనిపించును జీవమున్న మనిషికన్న శిలలే నయమని పించును ఈ నల్లని రాళ్లలో ఏ కన్నులు దాగెనో ఈ బండల మాటున ఏ గుండెలు మ్రోగెనో ఈ నల్లని రాలలో
Writer(s): Dr. C Narayana Reddy, S Rajeshwara Rao Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out