Lyrics

మిన్నంచుల వెన్నెల కన్నంచుల జల్లుగ జారితివే ఎద కోసే ప్రళయవిలాపమిదే ఊపిరినాపినదే స్వప్నం చెరిగినదే రక్తము సత్తువ చెదిరినదే ఒక రాజ్యము కూలినదే యుద్ధమే చేయక ఒరిగానే ఏ దరి వెతికెదనే నెచ్చెలీ నిన్నెట కాంచెదనే నిత్య నిశీధి ఇది చీకటి సూన్యమే మిగిలినదే చిత్ర నయనమది చక్కని చక్కెర పలుకులేవీ సుందరహాసమేది కావేరి నురగల పరుగులేవీ #PRE-CHORUS మంచుమబ్బులవలే ప్రేమగా తడిమిన చేతులెవీ గోరు వెచ్చ కాంతుల వేకువై వెలిగిన చూపులేవీ మిన్నంచుల వెన్నెల కన్నంచుల జల్లుగ జారితివే ఎద కోసే ప్రళయవిలాపమిదే ఊపిరినాపినదే ఆరని జ్వలనమయే హృదయం తీరని నరకమయే ప్రాణం శిధిలమయే సమయం చలనము లేనిదయే నిప్పుల ఉప్పెనలో నన్నిలా ముంచితివెందులకే నేరము చెయ్యక ఏ శిక్షలో వగచితి నీ కొరకే మిన్నంచుల వెన్నెల కన్నంచుల జల్లుగ జారితివే ఎద కోసే ప్రళయవిలాపమిదే ఊపిరినాపినదే స్వప్నం చెరిగినదే రక్తము సత్తువ చెదిరినదే ఒక రాజ్యము కూలినదే యుద్ధమే చేయక ఒరిగానే
Writer(s): Prabhakar Jog, Shantaram Nadgaonkar Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out