Lyrics

జననీ జన్మ భుమిశ్చ స్వర్గాదపీ గరీయసీ స్వర్గాదపీ గరీయసీ ఏ తల్లి నిను కన్నదో? ఏ తల్లి నిను కన్నదో? ఆ తల్లినే కన్న భూమి గొప్పదిరా జననీ జన్మ భుమిశ్చ స్వర్గాదపీ గరీయసీ స్వర్గాదపీ గరీయసీ నీ తల్లి మోసేది నవమాసాలే రా ఈ తల్లి మోయాలి కడవరకు రా కట్టే కాలే వరకు రా ఆ ఋణం తలకొరివితో తీరేను రా ఈ ఋణం ఏ రూపాన తీరేది రా? ఆ రూపమే ఈ జవాను రా త్యాగానికి మరో రూపు నువ్వు రా జననీ జన్మ భుమిశ్చ స్వర్గాదపీ గరీయసీ స్వర్గాదపీ గరీయసీ గుండె గుండెకు తెలుసు గుండె బరువెంతో ఆ గుండెకే తెలుసూ గుండె కోత బాదెంతో నీ గుండె రాయి కావాలి ఆ గుండెల్లో ఫిరంగులు మోగాలి మనిషిగా పుట్టిన ఓ మనిషీ మారాలి నువ్వు రాక్షసుడిగా మనుషులకోసం ఈ మనుషులకోసం ఈ మనుషులకోసం జననీ జన్మ భుమిశ్చ స్వర్గాదపీ గరీయసీ స్వర్గాదపీ గరీయసీ
Writer(s): Dasari Narayana Rao, J V Ragavulu Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out