ధిరనా ధిరనా ధిర ధిరనా
నా తనువున మనసున ఏదో థిల్లానా
మదనా మధనా ప్రియవదన
నీ జతనే అడిగెను ఈ సాయంత్రాన
మందారపు పెదవులలో
మధురిమలే ఈ సరిగమలై
రా రమ్మని పిలిచెనులే
పరువములే ఓ పదనిసలై
నీ పైనే భారం వేసి
తేలాలి నేనే గాల్లోనా
ఓ చేతుల్లో చెయ్యే వేసి
చేరాలి తారా తీరాన
ధిరనా ధిరనా ధిర ధిరనా
నా తనువున మనసున ఏదో థిల్లానా
ధిరనా ధిరనననా ధిర ధిరనా
నీ జతనే అడిగెను ఈ సాయంత్రాన
నువ్వే నా లోకంగా
ఉన్నాలే ఏకంగా
రారా సారంగ
నీ చూపే తాకంగా
ఊగాలే మైకంగా
రారా సాయంగా
అందాలతో పందాలు కాసి
నన్నే ఓడించు
నను నీతో నడిపించు
సందేలలో గంధాలు కాసి
నన్నే పూజించు
మహారాజై పాలించు
నీదేలే నీదేలే ఈ లలన
చల్లారి పోవాలి ఈ తపన
ధిరనా ధిరనా ధిర ధిరనా
నా తనువున మనసున ఏదో థిల్లానా
ధిరనా ధిరనా ధిర ధిరనా
నీ జతనే అడిగెను ఈ సాయంత్రాన
మందారపు పెదవులలో
మధురిమలే ఓ సరిగమలై
రా రమ్మని పిలిచెనులే
పరువములే ఓ పదనిసలై
నీ పైనే భారం వేసి
తేలాలి నేనే గాల్లోనా
ఓ చేతుల్లో చెయ్యే వేసి
చేరాలి తారా తీరాన