Lyrics

బారెడు తుపాకి పట్టి నువ్ భౌ భౌమనకురా బిడ్డో మూరెడు లాఠితోని నువ్ ముందుకు రాకురో కొడుకో తుపాకి చూపితే తుఫానులయితాం, లాఠి పడితే లాడాయి చేస్తాం రాజకీయపు రంకు కొడుకులని సంకలెత్తుకుని దుంకులాడితే కందిరీగలై కమ్ముకు వస్తాం, radicals మై రక్తం చూస్తాం బారెడు తుపాకి పట్టి నువ్ భౌ భౌమనకురా బిడ్డో మూరెడు లాఠితోని నువ్ ముందుకు రాకురో కొడుకో హే... ఎత్తిన తుపాకీనెవడు జేసెరా, చమటలొడిసిన labor అన్న రా పట్టిన లాఠిలెవడు చెక్కే రా, బానిస పట్టిన కూలి బిడ్డరా (బానిస పట్టిన కూలి బిడ్డరా) Police station పునాదులల్ల తాపీ తమ్ముల తాకతున్నది చాకపునెత్తుల నెత్తురుతోనే police station ఎర్రబడ్డది బారెడు తుపాకి పట్టి నువ్ భౌ భౌమనకురా బిడ్డో మూరెడు లాఠితోని నువ్ ముందుకు రాకురో కొడుకో అల్లూరి బడిలో ఉండగనే తెల్ల వాడి చెంపను గొట్టిండు జార్జి రెడ్డి కాలేజీలోనే దోపిడి దొంగలనెదిరించిండు (దోపిడి దొంగలనెదిరించిండు) చైనా దేశం chapter తియ్యి, Vietnam history తిరగెయ్యి దేశ దేశముల చరిత్ర చూడు students లేని పోరే లేదు (Students లేని పోరే లేదు) ఏళ్ళ మీద పిస్తోలు తిప్పి వాగెరిల్లాలుగా మారిపోతరు మా స్టూడెంట్లతో పెట్టుకుంటిరా మట్టి గడ్డలై మిగిలిపోతరు బారెడు తుపాకి పట్టి నువ్ భౌ భౌమనకురా బిడ్డో మూరెడు లాఠితోని నువ్ ముందుకు రాకురో కొడుకో శ్రీ రాముడు నీ ముందుకొచ్చెనా, అడవిల అన్నని ఎంట పడతరు పరశురాముడే మీకెదురైతే పట్టుకొని encounter అంటరు (పట్టుకొని encounter అంటరు) పాంచాలి మీ పంచకు వస్తే చీరలు మల్లా ఇప్పద్దీస్తరు ట్రైనింగుల్లో పెట్టిన ఒట్టు పూట పూట తాకట్టు పెట్టుతరు బారెడు తుపాకి పట్టి నువ్ భౌ భౌమనకురా బిడ్డో మూరెడు లాఠితోని నువ్ ముందుకు రాకురో కొడుకో తుపాకి చూపితే తుఫానులయితాం, లాఠి పడితే లాడాయి చేస్తాం రాజకీయపు రంకు కొడుకులని సంకలెత్తుకుని దుంకులాడితే కందిరీగలై కమ్ముకు వస్తాం, radicals మై రక్తం చూస్తాం బారెడు తుపాకి పట్టి నువ్ భౌ భౌమనకురా బిడ్డో మూరెడు లాఠితోని నువ్ ముందుకు రాకురో కొడుకో
Writer(s): Vandematharam Srinivas, Suddhala Ashok Teja Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out