Featured In

Credits

PERFORMING ARTISTS
S.P. Balasubrahmanyam
S.P. Balasubrahmanyam
Performer
Malavika
Malavika
Performer
COMPOSITION & LYRICS
M.M. Keeravani
M.M. Keeravani
Composer
Chandra Bose
Chandra Bose
Songwriter

Lyrics

నువ్వు నేను కలిసుంటేనే నాకెంతో ఇష్టం నువ్వు నేను మనమైతేనే ఇంకెంతో ఇష్టం నువ్వు నన్ను ప్రేమించావని నేన్నిన్ను ప్రేమించానని తెలిసాకా నువ్విక్కడుండి నేనక్కడుంటె నువ్విక్కడుండి నేనక్కడుంటె ఎంతో కష్టం నువ్వు నేను కలిసుంటేనే నాకెంతో ఇష్టం నువ్వు నేను మనమైతేనే ఇంకెంతో ఇష్టం నువ్వు నన్ను ప్రేమించావని నేన్నిన్ను ప్రేమించానని తెలిసాకా నువ్వక్కడుండి నేనిక్కడుంటె నువ్వక్కడుండి నేనిక్కడుంటె ఎంతో కష్టం ఎగరేసిన గాలి పటాలే ఎద లోతుకు చేరుతాయని రుచి చూసిన కాకెంగిళ్ళే అభిరుచులను కలుపుతాయని తెగ తిరిగిన కాలవ గట్లే కథ మలుపులు తిప్పుతాయని మనమాడిన గుజ్జన గూళ్ళే ఒక గూటికి చేర్చుతాయని లాలించి పెంచిన వాడే ఇకపై నను పరిపాలిస్తాడని తెలిసాక నువ్విక్కడుండి నేనక్కడుంటె నువ్విక్కడుండి నేనక్కడుంటె ఎంతో కష్టం నువ్వు నేను కలిసుంటేనే నాకెంతో ఇష్టం నువ్వు నేను మనమైతేనే ఇంకెంతో ఇష్టం ఆ బడిలొ పాఠాలే మన ప్రేమను దిద్దుతాయని ఆ రైలు పట్టాలే పల్లకినె పంపుతాయని రాళ్ళల్లో మన పేర్లే శుభలేఖలు చూపుతాయని ఆ బొమ్మల పెళ్ళిళ్ళే ఆశీస్సులు తెలుపుతాయని తనకే నే నేర్పిన నడకలు ఏడడుగులుగా ఎదిగొస్తాయని తెలిసాక నువ్వక్కడుండి నేనిక్కడుంటె నువ్వక్కడుండి నేనిక్కడుంటె ఎంతో కష్టం నువ్వు నేను కలిసుంటేనే నాకెంతో ఇష్టం నువ్వు నేను మనమైతేనే ఇంకెంతో ఇష్టం నువ్వు నన్ను ప్రేమించావని నేన్నిన్ను ప్రేమించానని తెలిసాకా నువ్విక్కడుండి నేనక్కడుంటె నువ్వక్కడుండి నేనిక్కడుంటె ఎంతో కష్టం
Writer(s): Anirudh Ravichander, Chandra Bose Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out