Music Video

Gopala Baludamma Song from Ooyala Movie | Srikanth, Ramya Krishna
Watch {trackName} music video by {artistName}

Featured In

Credits

PERFORMING ARTISTS
Chitra
Chitra
Performer
COMPOSITION & LYRICS
S. V. Krishna Reddy
S. V. Krishna Reddy
Composer
Sirivennela Sitarama Sastry
Sirivennela Sitarama Sastry
Songwriter

Lyrics

గోపాల బాలుడమ్మా నా చందమామ పదే పదే చూసుకున్న తనివి తీరదమ్మా రారా కన్నా కడుపారా కన్నా నా చిటికెలు వింటూ చూస్తావే నేనెవరో తెలుసా నాన్న నిను ఆడించే నీ అమ్మనురా నువ్వు ఆడుకొనే నీ బొమ్మనురా గోపాల బాలుడమ్మా నా చందమామ పదే పదే చూసుకున్న తనివి తీరదమ్మా గుండె మీద తాకుతుంటే నీ చిట్టి పాదం అందే కట్టి ఆడుతుందే ఈ తల్లి ప్రాణం ఉంగాలతోనే సంగీత పాఠం నేర్పావ నాకు నీ లాలి కోసం ఉగ్గు పట్టనా దిష్టి తగలని చుక్కపెట్టనా బోసి నవ్వుల భాషతో నువ్వు పిచ్చి తల్లికి ఊసులు చెబుతూ పలకరిస్తావు గోపాల బాలుడమ్మా నా చందమామ పదే పదే చూసుకున్న తనివి తీరదమ్మా ఏ నోము ఫలమో పండి ఈ మోడు కొమ్మ ఈనాడు నిన్నే పొంది అయిందిరా అమ్మా ఇదే నాకు నేడు మరో కొత్త జన్మ ప్రసాదించినాడు ఈ చిన్ని బ్రహ్మ మూసి ఉంచిన లేత పిడికిలి ఏమి దాచేరా నిన్ను పంపుతూ దేవుడు ఇచ్చిన వరములన్నీ గుప్పిట ఉంచి అమ్మకిచ్చావు గోపాల బాలుడమ్మా నా చందమామ పదే పదే చూసుకున్న తనివి తీరదమ్మా రారా కన్నా కడుపారా కన్నా నా చిటికెలు వింటూ చూస్తావే నేనెవరో తెలుసా నాన్న నిను ఆడించే నీ అమ్మనురా నువ్వు ఆడుకొనే నీ బొమ్మనురా
Writer(s): Chembolu Seetharama Sastry, S V Krisna Reddy Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out